కరీంనగర్ టౌన్,వెలుగు: భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,641 కోట్లతో నిర్మించిన హనుమకొండ– కరీంనగర్ ఎన్‌హెచ్ 563 నిర్మాణం పూర్తయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు బుధవారం తెలిపారు.
హైవే రాకపోకలకు సిద్ధం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 68 కిలోమీటర్ల మేర అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో నిర్మించిన 4 లేన్ల రోడ్డు త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో ఈ హైవే పూర్తయినట్లు చెప్పారు.
