హైదరాబాద్ బోడుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. గురువారం ( సెప్టెంబర్ 10 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బోడుప్పల్ లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరలోని ఓ హోటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో హోటల్ లో రెండు సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్దఎత్తున వ్యాపించి పక్కనే ఉన్న రెండు ఫుడ్ కోర్టులకు కూడా వ్యాపించి అవి కూడా పూర్తిగా దగ్దమయ్యాయి.
ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలును అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
