డిగ్రీ, పీజీ చేశారా ? తెలంగాణ CGGలో ఉద్యోగాలు ! పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో జాబ్

 డిగ్రీ, పీజీ  చేశారా ? తెలంగాణ CGGలో ఉద్యోగాలు ! పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో జాబ్

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), తెలంగాణ  పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, డేటా అనలిస్ట్/ ఎంఐఎస్ స్పెషలిస్ట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎక్స్​పర్ట్, మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ స్పెషలిస్ట్, టీమ్ లీడర్, రీసెర్చ్ అసోసియేట్, పబ్లిక్ హెల్త్ ఎక్స్​పర్ట్. 

విద్యార్హతలు
అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్
: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.

డేటా అనలిస్ట్ / ఎంఐఎస్ స్పెషలిస్ట్: సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంసీఏ లేదా  మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎక్స్​పర్ట్: హెల్త్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్​కేర్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్​లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ స్పెషలిస్ట్: పబ్లిక్ పాలసీ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మానిటరింగ్ & ఇవాల్యుయేషన్, పబ్లిక్ హెల్త్, హెల్త్​​కేర్ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్​ మాస్టర్స్ డిగ్రీ  ఉండాలి.

టీమ్ లీడర్: పబ్లిక్ హెల్త్, హెల్త్ సిస్టమ్స్, హెల్త్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనిటీ మెడిసిన్, పబ్లిక్ పాలసీ, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ స్టడీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

రీసెర్చ్ అసోసియేట్: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

పబ్లిక్ హెల్త్ ఎక్స్​పర్ట్: ఎంబీబీఎస్​తోపాటు పబ్లిక్ హెల్త్​లో మాస్టర్స్ (ఎంపీహెచ్) లేదా ఎండీ (కమ్యూనిటీ మెడిసిన్) పూర్తిచేసి ఉండాలి.  

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cgg.gov.inను సందర్శించండి.