సెప్టెంబర్ 15లోగా ఓపెన్ స్కూల్లో చేరండి: స్టేట్ కో ఆర్డినేటర్

సెప్టెంబర్ 15లోగా ఓపెన్ స్కూల్లో చేరండి: స్టేట్ కో ఆర్డినేటర్

యాదాద్రి, వెలుగు: చదువు మధ్యలో ఆపేసిన వాళ్లు ఈ నెల 15 వరకూ ఓపెన్ స్కూల్లో చేరాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ అరుంధతి, డీఆర్​డీవో నాగిరెడ్డి సూచించారు. బుధవారం ఓపెన్​ స్కూల్స్లో స్డూడెంట్స్​జాయినింగ్స్పై రివ్యూ అనంతరం పోస్టర్​రిలీజ్ చేసి మాట్లాడారు. 

మహిళా సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటున్న వాళ్లు చేరాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన టార్గెట్ రీచ్​కావాలని ఆదేశించారు.

ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పెంచడానికి విద్యాశాఖ, ఇంటర్మీడియట్ డిపార్ట్​మెంట్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్​మీడియట్​ ఆఫీసర్​ బీ సురేశ్​ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజేషన్​ ఆఫీసర్​ పెసరు లింగారెడ్డి, కరుణ శ్రీ ఉన్నారు.