యాదగిరిగుట్ట మెట్ల మార్గానికి ‘టెన్సిల్ కానోపీ’ పైకప్పు

యాదగిరిగుట్ట మెట్ల మార్గానికి ‘టెన్సిల్ కానోపీ’ పైకప్పు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేందుకు మెట్ల మార్గంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసే భారీ పైకప్పు(టెన్సిల్ కానోపీ) నిర్మాణానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. 

బుధవారం దాతలతో కలిసి ఆలయ ఈవో భవానీ శంకర్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రతినిధి ప్రమోద్ అగర్వాల్ విరాళంగా ఇచ్చిన రూ.1.50 కోట్లతో ఈ పనులను చేపడుతున్నారు.