జార్ఖండ్ ఓటరు లిస్టులో అఫ్గాన్ల పేర్లు..సమగ్ర విచారణకు ఈసీ ఆదేశం

జార్ఖండ్ ఓటరు లిస్టులో అఫ్గాన్ల పేర్లు..సమగ్ర విచారణకు ఈసీ ఆదేశం

రాంచి: జార్ఖండ్​లో జరిగిన స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్​(సర్) ప్రక్రియ తప్పులతడకగా ఉంది. జంషెడ్​పూర్​ తూర్పు అసెంబ్లీ నియోజవర్గం 286 ఓటరు లిస్టులో అసిల్ ఖాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఇబ్రహీం అనే అఫ్గాన్ల పేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నికల సంఘం వెంటనే ఈ పేర్లను తొలగించింది. 

విదేశీయుల పేర్లు ఓటరు జాబితాలో ఎలా యాడ్​ అయ్యాయి, ఎవరి ప్రమేయం ఉంది.. అనే కోణంలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జార్ఖండ్​ సీఈవో కె.రవికుమార్​ తెలిపారు. సర్ నిర్లక్ష్యంపై బీజేపీ రాష్ట్ర స్పోక్​పర్సన్​ సందీప్​వర్మ సీరియస్ ​అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.