గొప్ప థియేట్రికల్ అనుభూతి పంచేలా.. మహేంద్రగిరి వారాహి..

గొప్ప థియేట్రికల్ అనుభూతి పంచేలా.. మహేంద్రగిరి వారాహి..

‘రంగమార్తాండ’ చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మధు కలిపు.. రెండో ప్రయత్నంగా ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రాన్ని తెరకెక్కించారు.  సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మధు కలిపు మాట్లాడుతూ ‘డివోషనల్ ఎలిమెంట్స్‌‌తో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ఇది. కేవలం టైటిల్‌‌ కోసం బలవంతంగా కొన్ని అంశాలు జోడించడం కాకుండా, వారాహి అమ్మవారి చుట్టూ జరిగే ఆర్గానిక్‌‌ స్టోరీ ఇది. సినిమాలో ఓ వెయ్యి సార్లైనా అమ్మవారి పేరు వినిపిస్తుంది.  

ఐశ్వర్య రాజేష్ అమ్మవారి రూపంలో  కనిపిస్తారు. సుమంత్ గారి నటన అద్భుతంగా ఉంటుంది. సిద్దు జొన్నలగడ్డ గారి పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయనతో నాకు ముందే పరిచయం ఉంది. ఈ కథ, పాత్ర నచ్చి ఆయన కీరోల్ ప్లే చేశారు. తన పాత్ర ప్రభావం సినిమా అంతా ఉంటుంది. ఇక కథకు తగ్గట్టుగా రాజీ పడకుండా నిర్మించాం.   రామచంద్రపురం కోట, ముచ్చింతల్, గండికోట, ఒరిస్సాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేశాం. 

అమ్మవారి గర్భగుడి మాత్రం భారీ సెట్ వేశాం.  అలాగే దాదాపు గంట పాటు వీఎఫ్​ఎక్స్‌‌ వర్క్ ఉంటుంది.  ఆ సీన్స్‌‌ చాలా నేచురల్‌‌గా వచ్చాయి.  గొప్ప థియేట్రికల్ అనుభూతి పంచేలా ఉంటుంది.  కంటెంట్‌‌పై నమ్మకంతో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయింది.  సినిమా చూసిన ప్రేక్షకులు గొప్ప భక్తి భావంతో బయటకు వస్తారు. ప్రస్తుతం ఓ హారర్ సినిమా చేస్తున్నాం. అలాగే సంతోష్‌‌తోనే మరో సినిమా చేసే ఆలోచన ఉంది’ అని చెప్పారు.