ఫ్యామిలీస్‌‌ కు నచ్చేలా.. కళ్యాణం కమనీయం జీవితం..

ఫ్యామిలీస్‌‌ కు నచ్చేలా.. కళ్యాణం కమనీయం జీవితం..

ఖాన్ దురాని, సాహితీ అవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’.  ఈనెల 18న సినిమా విడుదల కానుంది.  రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  

డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌ చెప్పారు.  చక్కని కథ,  కథనాలతో ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అని దర్శకుడు రవి లోకి రెడ్డి చెప్పారు. 

లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు మంచి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో మనందరిలో ఒకరికి జరిగే కథలా అలరిస్తుందని  నిర్మాతలు తెలియజేశారు.  హీరోహీరోయిన్స్‌‌ ఖాన్‌‌ దురాని, సాహితీ అవంచ,  నటి విషిక,  మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.