విలీన గ్రామాల ఉద్యోగులకు..సవరించిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 

విలీన గ్రామాల ఉద్యోగులకు..సవరించిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 
  • ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన హెచ్ఆర్ఏ తక్షణమే వర్తింపజేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలిలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్ తదితర విలీన ప్రాంతాల్లో పాత రేట్ల ప్రకారమే హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారనీ, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఇంటర్మీడియెట్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఫైర్ ఎన్ఓసీలు లేని, ఒకే అనుమతితో వివిధ చోట్ల నడుస్తున్న కాలేజీలను తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.