బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లయ్  చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కాగా సెప్టెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ – సీ & ఐసీ.

మొత్తం ఖాళీలు: 1100.

విభాగాల వారీగా ఖాళీలు
వెల్త్ ఎగ్జిక్యూటివ్ (జేఎంజీ( ఎస్–I) – వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్: 1000 (ఎస్సీ–150, ఎస్టీ–75, ఓబీసీ–270, ఈడబ్ల్యూఎస్–100, అన్ రిజర్వ్డ్–405).

క్రెడిట్ అనలిస్ట్ –  సీ & ఐసీ (ఎంఎంజీ/ ఎస్–II) – కార్పొరేట్ & ఇన్​స్టిట్యూషనల్ క్రెడిట్: 100 (ఎస్సీ–15, ఎస్టీ–8, ఓబీసీ–27, ఈడబ్ల్యూఎస్–10, అన్ రిజర్వ్డ్–40).

విద్యార్హత
వెల్త్ ఎగ్జిక్యూటివ్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ  పూర్తిచేసి ఉండాలి. ఐసీ 38 (ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), ఎన్ఐఎస్ఎం సిరీస్ వీఏ (మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్), ఎన్ఐఎస్ఎం సిరీస్ ఎక్స్ఎక్స్ఐ-ఏ (పీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్), ఎన్ఐఎస్ఎం సిరీస్ వీడీ(- మ్యూచువల్ ఫండ్ - స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్) కలిగి ఉండాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ పీజీ డిగ్రీ/ డిప్లొమా లేదా ఎంబీఏ (ఫైనాన్స్/ మార్కెటింగ్/ బ్యాంకింగ్) చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా విదేశీ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీస్ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు లేదా వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో వెల్త్ ప్రొడక్ట్స్ విక్రయాల విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

క్రెడిట్ అనలిస్ట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేయడంతోపాటు చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  బ్యాంకింగ్ రంగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. కార్పొరేట్ క్రెడిట్ విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయసు
వెల్త్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు 22 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు 21 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 4.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్కూట్నీ,  ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.bankofbaroda.bank.inను సందర్శించండి.

ఆన్​లైన్ టెస్ట్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్/ ఎకనామిక్ & బ్యాంకింగ్ అవేర్​నెస్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నిర్దిష్ట పోస్టు సంబంధిత సబ్జెక్టులపై 20 ప్రశ్నలు 20 మార్కులకు ఇస్తారు. మొదటి మూడు సెక్షన్లు కేవలం అర్హత కోసం మాత్రమే. ఈ సెక్షన్లలో వచ్చిన మార్కులను మెరిట్ జాబితా తయారీకి పరిగణలోకి తీసుకోరు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.