యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో రెండు హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. కుళ్లిన మాంసం సహా కూరగాయలను ధ్వంసం చేసి, హోటల్స్‌ను సీజ్ చేశారు.
భువనగిరి బైపాస్ రోడ్‌లోని చాచా దాబాపై తొలుత ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జ్యోతిర్మయి, డిజిగ్నేటెడ్ ఆఫీసర్ స్వాతి, ఆఫీసర్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఫ్రిజ్‌ను తనిఖీ చేయగా అందులో నిల్వ చేసిన 83 కిలోల మాంసం ఉన్నట్టు గుర్తించారు.
తినలేని విధంగా ఈ మాంసాన్ని సింథటిక్ కలర్స్ ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేసి వినియోగిస్తున్నారని గుర్తించారు. మాంసం సహా కూరగాయలను ధ్వంసం చేసి హోటల్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసి సీజ్ చేశారు.
అనంతరం మల్కాపూర్‌లోని సంగం హోటల్‌పై దాడులు నిర్వహించి 10 కిలోల కుళ్లిన మాంసంతో పలురకాల ఉత్పత్తులు వంట చేసినట్టు గుర్తించారు. మాంసంతో పాటు 5 కిలోల కూరగాయలు, 30 కిలోల గ్రేవీలు, 10 కిలోల టీ పొడిని ధ్వసం చేశారు. హోటల్‌కు నోటీసులు జారీ చేశారు.
