డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వడ్డేపల్లి ఎంఈఓ సస్పెన్షన్

డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వడ్డేపల్లి ఎంఈఓ సస్పెన్షన్

గద్వాల/శాంతినగర్, వెలుగు: డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి ఎంఈఓ నరసింహులును సస్పెండ్ చేసినట్లు డీఈవో విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ అనధికారికంగా నిర్వహిస్తుండడంతో గతంలోనే గుర్తింపు రద్దు చేసినట్లు తెలిపారు.

ఆ పాఠశాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకోవడంలో, ప్రభుత్వానికి క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించడంలో ఎంఈఓ విఫలమైనట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైన్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ లు స్కూల్ పై విచారణ  చేపట్టారని తెలిపారు. ఎంఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నివేదిక రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.