పెళ్లయిన 4 నెలలకే యువతి సూసైడ్..భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు

పెళ్లయిన 4 నెలలకే యువతి సూసైడ్..భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: పెళ్లయిన 4 నెలలకే ఓ యువతి సూసైడ్​చేసుకుంది. భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాకు చెందిన ముద్దం నాగలక్ష్మి(18)కి ఈ ఏడాది ఏప్రిల్ 26న మాదగాని శేఖర్‌‌‌‌తో వివాహం జరిగింది. తర్వాత దంపతులు బంజారాహిల్స్‌‌‌‌లోని సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌నగర్ లో ఉంటున్నారు. 

కాగా, నాగలక్ష్మి తనకు ఇష్టం లేదంటూ శేఖర్​ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని నాగలక్ష్మి తన పుట్టింటివారికి చెప్పుకొని ఏడ్చింది. ఈ క్రమంలో బుధవారం ఆమె ఉరేసుకుంది. కుటుంబసభ్యులు నిమ్స్ హాసిటల్​కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. భర్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ముద్దం నాగయ్య బంజారాహిల్స్​ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.