- స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
పద్మారావునగర్, వెలుగు: పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోందని పీసీసీ వైస్‌ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. బేగంపేట్ డివిజన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విశాల్ సూదం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అర్హులైనవారికి 15 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని చెప్పారు. ప్రభుత్వం ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తోందని పేర్కొన్నారు. అనంతరం బేగంపేట్ డివిజన్ నాయకుడు కృష్ణ ఏర్పాటు చేసిన నూతన రెస్టారెంట్ చైనా టౌన్ బిర్యానీ హౌస్‌ను నీలిమ ప్రారంభించారు.
