గాంధీభవన్‌‌లో ముఖాముఖి.. ప్రజా పాలనలో పేదల సమస్యలను పరిష్కరిస్తాం

గాంధీభవన్‌‌లో ముఖాముఖి.. ప్రజా పాలనలో పేదల సమస్యలను పరిష్కరిస్తాం
  • ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వ సలహాదారు   హర్కర వేణుగోపాల్

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో పేదల సమస్యల పరిష్కారానికే ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌‌లో మాట్లాడి పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పింఛన్లకు సంబంధించి ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయి.