కరీంనగర్ సిటీ: కేపీఎస్ లో ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలు

కరీంనగర్ సిటీ: కేపీఎస్ లో ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలు

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీ రేకుర్తిలోని కేపీఎస్ హైస్కూల్‌‌ మైదానంలో ఈనెల 11, 12 తేదీల్లో అండర్–14,17 విభాగాల్లో కరీంనగర్ అర్బన్ స్థాయి ఎస్జీఎఫ్​ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు కోట గ్రూప్ విద్యాసంస్థల  చైర్మన్ డాక్టర్ దబ్బెట అంజిరెడ్డి తెలిపారు. 

ఈ మేరకు బుధవారం పోటీల పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారిలో క్రమశిక్షణ,  క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌‌జీఎఫ్‌‌  జిల్లా కార్యదర్శి బన్సీలాల్‌‌,  అర్బన్‌‌ కార్యదర్శి శంకరయ్య,  పీఈటీ శ్రీనివాస్‌‌, తదితరులు పాల్గొన్నారు.