- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారంలో ఘటన
శంకరపట్నం, వెలుగు : అనారోగ్యంతో తల్లి చనిపోగా... తట్టుకోలేక కూతురు సైతం మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్తారం గ్రామానికి చెందిన బొంగోని విజయ (58)కు ఇద్దరు కొడుకులు, కుమార్తె మంజుల (38) ఉన్నారు. మంజుల దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులతోనే ఉంటోంది.
విజయ మంగళవారం వాంతులు, విరేచనాలతో బాధ పడడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే గుండెపోటుతో చనిపోయింది. దీంతో విజయ డెడ్ బాడీని ముత్తారం గ్రామానికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా... మంజుల ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. గంటల వ్యవధిలోనే తల్లీకూతురు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అమలుకున్నాయి.
