వేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా

వేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్​వద్ద నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా బయలుదేరుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు అరెస్ట్​చేసి, ఠాణాలకు తరలించారు. 

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు కె.సునీత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ​ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్​  చేశారు.