టీవీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల ..ప్రమోషన్ల ప్రక్రియ షురూ

టీవీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల ..ప్రమోషన్ల ప్రక్రియ షురూ
  • ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు విడుదల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సేవలందిస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) స్పెషలిస్టుల ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టును అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ క్రిస్టినా జెడ్. చొంగ్తు ఉత్తర్వులు  జారీ చేశారు.

గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, ఈఎన్‌‌‌‌టీ, ఆప్తాల్మాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, పల్మనరీ మెడిసిన్, ఫొరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి సర్వీసు నియామకం, రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, పీజీ అర్హతల ప్రాతిపదికన ఈ సీనియారిటీ లిస్టును  రూపొందించారు.