హైదరాబాద్, వెలుగు: వీవీసీ మోటర్స్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల షోరూమ్‌ను కొత్తగూడలో బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పీవీసీ మోటార్స్ ఎండీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 10 కార్లను ప్రదర్శించే సామర్థ్యంతో అత్యాధునిక ప్రమాణాలతో ఈ షోరూమ్‌ను రూపొందించినట్లు చెప్పారు.
రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ కార్ల కోసం భారీ వర్క్‌షాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నగరమంతటా తమకు సర్వీస్ నెట్‌వర్క్ ఉందని వివరించారు.
