12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీ 2025 సంవత్సరానికిగాను 12 మంది ప్రముఖులను ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. వర్సిటీ వీసీ నిత్యానందరావు, రిజిస్ట్రార్  కోట్ల హనుమంతరావు వెల్లడించారు.

కవితా విభాగంలో బెల్లంకొండ ప్రసేన్‌‌, విమర్శ విభాగంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి, చిత్రలేఖనంలో గుండోజు యాదగిరి, శిల్పకళలో బీవీఆర్ చారి, నృత్యంలో జొన్నలగడ్డ అనురాధ, సంగీతంలో మహావాది సరిత ఎంపికయ్యారు.

పత్రికా రంగం నుంచి ఓలేటి పార్వతీశం, నాటకరంగం నుంచి ఎం. దివాకర్‌‌ బాబు, జానపద కళారంగం నుంచి భట్టు కిషన్‌‌, అవధానం నుంచి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఉత్తమ రచయిత్రిగా కె.ఆశాజ్యోతి, నవలా రంగం నుంచి కేవీ నరేందర్‌‌  ఎంపికయ్యారు. వారికి రూ.30,116తో పాటు సత్కరించనున్నారు.