కోల్‌బెల్ట్, వెలుగు: పోలీసులు నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమర్రి సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే విధంగా ప్రజల్లో నమ్మకం, భరోసా పెంపొందించాలని తెలిపారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను సీపీ పరిశీలించారు. ముందుగా స్టేషన్ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ పర్స రమేశ్, టౌన్ ఎస్సై నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి పీఎస్ తనిఖీ
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ వివరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష్య, సమన్వయ వంటి సాంకేతిక పోర్టల్స్, అప్లికేషన్ల పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
