ఆల్  ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్  చైర్మన్ గా మధు యాష్కీ

ఆల్  ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్  చైర్మన్ గా మధు యాష్కీ

న్యూఢిల్లీ, వెలుగు: ఆల్  ఇండియా ప్రొఫెషనల్స్  కాంగ్రెస్  చైర్మన్ గా మాజీ ఎంపీ, తెలంగాణ సీనియర్  నేత మధు యాష్కీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ నేషనల్  జనరల్  సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్  ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే ఆమోదంతో యాష్కీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన మాజీ చైర్మన్  ప్రవీణ్  చక్రవర్తి సేవలను అధిష్టానం ఈ సందర్భంగా కొనియాడింది.