దులీప్ ట్రోఫీ ఫైనల్లో విజయం దిశగా ఈస్ట్‌‌ జోన్‌‌... రెండో ఇన్నింగ్స్ లో 212/5

దులీప్ ట్రోఫీ ఫైనల్లో విజయం దిశగా ఈస్ట్‌‌ జోన్‌‌... రెండో ఇన్నింగ్స్ లో 212/5

చెన్నై: సౌత్‌‌ జోన్‌‌తో జరుగుతున్న దులీప్‌‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌‌ జోన్‌‌ విజయం దిశగా సాగుతోంది. కెప్టెన్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (80), శిఖర్‌‌ మోహన్‌‌ (52) హాఫ్‌‌ సెంచరీలు సాధించడంతో.. బుధవారం నాలుగో రోజు ఆట ముగిసే టైమ్‌‌కు ఈస్ట్‌‌ జోన్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 51 ఓవర్లలో 212/5 స్కోరు చేసింది. 

కుమార్‌‌ కుశాగ్ర (34 బ్యాటింగ్‌‌), కౌనైన్‌‌ ఖురైషి (26 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. వైభవ్‌‌ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్‌‌ (3), సుదీప్‌‌ కుమార్‌‌ గరానీ (2) విఫలమయ్యారు. అంతకుముందు 242/6 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన సౌత్‌‌ జోన్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 107.3 ఓవర్లలో 336 రన్స్‌‌కు ఆలౌటైంది. 

కెప్టెన్‌‌ తిలక్‌‌ వర్మ (99) తృటిలో సెంచరీ మిస్‌‌ చేసుకున్నాడు. చామ మిలింద్‌‌ (43) ఫర్వాలేదనిపించినా.. త్రిపురాన విజయ్‌‌ (1), సిరాజ్‌‌ (1) నిరాశపర్చారు. ముకేశ్‌‌ కుమార్‌‌ 3, షమీ, ఖురేషి, శిఖర్‌‌ మోహన్‌‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఈస్ట్‌‌ జోన్‌‌ 584 రన్స్‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.