కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలో నంబర్‌‌‌‌ వన్‌‌గా తీర్చిదిద్దాం : చైర్మన్ డాక్టర్ సీహెచ్ రాజేశ్వర్‌‌‌‌రావు

కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలో నంబర్‌‌‌‌ వన్‌‌గా తీర్చిదిద్దాం :  చైర్మన్ డాక్టర్ సీహెచ్ రాజేశ్వర్‌‌‌‌రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: డాక్టర్ వర్గీస్ కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపినట్లు డెయిరీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ రాజేశ్వర్‌‌‌‌రావు తెలిపారు. బుధవారం కురియన్ వర్ధంతి సందర్భంగా డెయిరీ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళంలో 46,400 మంది పాల రైతులతో 219 సహకార సంఘాలను సంఘటితం చేసి అమూల్ బ్రాండ్‌‌కు ప్రాచుర్యం కల్పించినట్లు గుర్తుచేశారు.

కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీలో ప్రస్తుతం రోజుకు 2లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నామని, రాబోయే కాలంలో రోజుకు 5 లక్షల లీటర్ల సేల్స్ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎండీ డా.పి.శంకర్‌‌‌‌రెడ్డి, డెయిరీ ఆఫీసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.