డబుల్ బెడ్రూం ఇండ్లలో లేని వారికి నోటీసులు.. అద్దెకిచ్చినా.. అమ్మినా చర్యలు తప్పవు..

డబుల్ బెడ్రూం ఇండ్లలో లేని వారికి నోటీసులు.. అద్దెకిచ్చినా.. అమ్మినా చర్యలు తప్పవు..
  • జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా 

గద్వాల, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరై ఆ ఇండ్లలో ఉండని వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల ఆఫీసర్లతో కలిసి కలెక్టర్‌‌‌‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఇండ్లు తాళం వేసి ఉండడానికి గమనించి ఇండ్లలో నివాసముండని వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలన్నారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అద్దెకిచ్చిన అమ్మిన చర్యలు తప్పవన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన వారు తప్పనిసరిగా ఇక్కడే ఉండాలన్నారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌‌లో జిల్లా డీసీసీ, డీఎల్ఆర్పీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి మార్చి 31న 228, 74 శాతం ఉండగా జూన్ 30న 227.60 శాతం నమోదయిందని, దీనిని పెంచేలా రుణ మంజూరును స్పీడప్‌‌ చేయాలన్నారు. మంగళవారం టౌన్‌‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.