నిజామాబాద్ ప్రగతి హాస్పిటల్లోకి తండ్రి డెడ్బాడీతో వెళ్లి డబ్బులు డిమాండ్.. ఇద్దరు కొడుకులపై కేసు

నిజామాబాద్ ప్రగతి హాస్పిటల్లోకి తండ్రి డెడ్బాడీతో వెళ్లి డబ్బులు డిమాండ్.. ఇద్దరు కొడుకులపై కేసు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ప్రగతి హాస్పిటల్లోకి డెడ్​బాడీతో చొరబడిన అతడి కొడుకులు, మరికొందరు స్టాఫ్​ను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్​ చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పోచంపాడ్​కు చెందిన ఓ వృద్ధుడిని ట్రీట్​మెంట్​ కోసం ఆగస్టు 30న ప్రగతి హాస్పిటల్​లో చేర్చారు. డాక్టర్లు వెంటిలేటర్​పై పెట్టి చికిత్స అందించారు. ఆ తర్వాతి రోజు బంధువులు నగరంలోని మరో హాస్పిటల్కు షిఫ్ట్​చేసి అక్కడ 6 రోజులపాటు ట్రీట్​మెంట్​అందించగా సోమవారం ఆ వృద్ధుడు మరణించాడు.

అయితే ప్రగతి హాస్పిటల్​లో నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ అతడి కొడుకులు శ్రీకాంత్, మహిపాల్​ మరికొందరు డెడ్​బాడీతో వచ్చి హంగామా చేశారు. మరో  హాస్పిటల్​లో అయిన బిల్​కట్టమని మేనేజ్​మెంట్​ను భయపెట్టారు. హాస్పిటల్​లోకి డెడ్​బాడీని తీసుకొచ్చి రోగుల సేవలకు ఇబ్బంది కలిగించారు. హాస్పిటల్​యాజమాన్యం ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా శ్రీకాంత్, మహిపాల్​పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.