కురుమూర్తి గుట్టలో అక్రమ తవ్వకాలపై విచారణ: కాంట్రాక్టర్పై చర్యలకు మైనింగ్ శాఖకు నివేదిక

కురుమూర్తి గుట్టలో అక్రమ తవ్వకాలపై విచారణ: కాంట్రాక్టర్పై చర్యలకు మైనింగ్ శాఖకు నివేదిక

చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన ‘కురుమూర్తి గుట్టకు మైనింగ్ ముప్పు’ కథనంపై కలెక్టర్​ స్పందించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, మైనింగ్ అధికారుల టీమ్​ క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది.

గూడూర్ గ్రామం సర్వే నంబర్ 99లోని ప్రభుత్వ భూమిలో సివిట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ ఈశ్వర్ రెడ్డి ఎలాంటి అనుమతులు పొందకుండానే సుమారు 8,233 క్యూబిక్ మీటర్ల (12,350 మెట్రిక్ టన్నుల) గ్రావెల్‌‌ను అక్రమంగా తవ్వి తరలించినట్లు నిర్ధారించి, సదరు కాంట్రాక్టర్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖకు సమగ్ర నివేదికను సమర్పించినట్లు తహశీల్దార్ కె. ఎల్లన్న బుధవారం తెలిపారు.