వన్ ప్లస్ 16 వచ్చేస్తోంది.. 200MP కెమెరానా.. బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుసా !

వన్ ప్లస్ 16 వచ్చేస్తోంది.. 200MP కెమెరానా.. బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుసా !

చైనా టెక్ సంస్థ వన్ ప్లస్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. వన్ ప్లస్ 16 స్మార్ట్ ఫోన్ను అతి త్వరలో విడుదల చేయనుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీ హైలైట్గా నిలవనుంది. వన్ ప్లస్ 16 స్మార్ట్ ఫోన్ 9000mAh బ్యాటరీతో ఉంటుందని టెక్ వర్గాల సమాచారం.

వన్‌ప్లస్ 15లో బ్యాటరీ సామర్థ్యం 7,300mAh. ఈ బ్యాటరీ సామర్థ్యంతో పోలిస్తే ఈ పరిణామాన్ని పెద్ద ముందడుగుగా భావించవచ్చు. వన్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో బ్యాటరీ సామర్థ్యం విషయంలో వన్‌ప్లస్ 16దే టాప్ ప్లేస్. అంతేకాదు.. ఒప్పో-డిజైన్డ్ చిప్‌ను వన్‌ప్లస్ ఈ ఫోన్లో ఉపయోగించినట్లు తెలిసింది. ఇదే నిజమైతే.. బ్యాటరీ లైఫ్‌ మరింత మెరుగ్గా ఉంటుంది.

ఇక.. వన్ ప్లస్ 16 డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వన్‌ప్లస్ 15 గరిష్టంగా 165Hz దగ్గరే ఆగిపోయింది. ఈ విధంగా చూసుకుంటే..185Hz రిఫ్రెష్ రేట్ బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. గేమర్‌లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 6.78-అంగుళాల BOE ఓరియంటల్ స్క్రీన్ 4.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ఈ ఫోన్ ఇతర ఫీచర్లు.

క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌తో ఈ ఫోన్ తయారైనట్లు టాక్. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, చైనీస్ వెర్షన్ కలర్‌ఓఎస్ 17తో వస్తుందని చెప్తున్నారు. ఇక.. ఈ ఫోన్ లో మరో హైలైట్ ఏంటంటే.. ప్రైమరీ కెమెరా. 200-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్‌ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ హైలైట్ అని టాక్. 

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ కెమెరాతో ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.71 వేల నుంచి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే.. వన్ ప్లస్ 16లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్పై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇవన్నీ పుకార్లకే పరిమితం.