మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాను 2026-–27 విద్యా సంవత్సరంలో విద్యా రంగంలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు, టీచర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న తొమ్మిదో జాతీయ పోషణ్ మాసం పోస్టర్‌ను డీడబ్ల్యువో హేమభార్గవితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి మాతా శిశు సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కరాటేలో 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌తో పాటు 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నిత్యశ్రీని కలెక్టర్ అభినందించి శాలువాతో సన్మానించారు.
