సంగారెడ్డి టౌన్, వెలుగు: పార్టీలో పదవులు రాని వారు ఎవరూ నిరాశ చెందవద్దని, పదవులు వచ్చినా రాకున్నా ప్రతి కార్యకర్తను గుర్తిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భరోసానిచ్చారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం నిర్వహించారు.
నాలుగు మండలాల కమిటీలతో పాటు వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు పోలీసు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో వన్‌టువన్‌గా మాట్లాడి సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శితో పాజీ అనంత్ కిషన్, చెరియల ఆంజనేయులు, షఫి హఫీజ్, కూన సంతోష్, జార్జ్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, చెరియల ఆంజనేయులు, షఫి హఫీజ్, కూన సంతోష్, జార్జ్ కిరణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
