సిద్దిపేట రూరల్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. గంగాధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బుధవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ సముదాయంలో రీజినల్ రింగ్ రోడ్ భూ సేకరణ నేషనల్ హైవే, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ కె హైమావతి తో కలిసి సమీక్షించారు.
ఈ పెద్ద ప్రాజెక్టు జిల్లాలోని రాయపోల్, వర్గల్, మర్కుక్, గజ్వేల్, జగదేవ్ పూర్ మండలాల ద్వారా వెళ్తుందని, భూ సేకరణ పూర్తయిన ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించి రైతులు ఎలాంటి క్రాప్ వేయకుండా భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
