సిద్దిపేట రూరల్, వెలుగు: వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో నిర్మిస్తున్న రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ భవనంతో పాటు అన్ని గృహాల్లో ఇంకుడు గుంతలు, ప్రతి పొలానికి పంటకుంట వంటి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
