ఇండియా–ఎ జట్టులో హార్దిక్‌‌

ఇండియా–ఎ జట్టులో హార్దిక్‌‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా–ఎతో జరగనున్న మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు ఇండియా–ఎ జట్టును ప్రకటించారు. సీనియర్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాను జట్టులోకి తీసుకున్నారు. అయితే అతను ఫిట్‌‌నెస్‌‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ఐపీఎల్‌‌ తర్వాత పాండ్యా.. తొడ కండరాల గాయంతో ఆటకు దూరంగా ఉంటున్నాడు.

ఈ నెల 22 నుంచి పుదుచ్చేరిలో జరగనున్న మల్టీ డే మ్యాచ్‌‌తో ఈ టూర్‌‌ మొదలవుతుంది. 29 నుంచి రెండో మ్యాచ్‌‌ జరుగుతుంది. అక్టోబర్‌‌ 6, 9, 11న మూడు వన్డేలు పుదుచ్చేరిలో జరగనున్నాయి. పాదం గాయం నుంచి కోలుకున్న సాయి సుదర్శన్‌‌ను మల్టీ డే మ్యాచ్‌‌లకు వైస్‌‌ కెప్టెన్‌‌గా నియమించారు. 

మరోవైపు ఈ నెల 27, 30, అక్టోబర్‌‌ 3న టీమిండియా.. వెస్టిండీస్‌‌తో మూడు వన్డేలు ఆడనుంది. మల్టీ డే మ్యాచ్‌‌లకు జట్టు: దేవదత్‌‌ పడిక్కల్‌‌ (కెప్టెన్‌‌), సాయి సుదర్శన్‌‌, అమన్‌‌ మోఖడే, ఆయుష్‌‌ పాండే, యష్‌‌ రాథోడ్‌‌, షేక్‌‌ రషీద్‌‌, కుమార్‌‌ కుశాగ్ర, శామ్స్‌‌ ములానీ, తనుష్‌‌ కొటియాన్‌‌, తుషార్‌‌ దేశ్‌‌పాండే, అన్షుల్‌‌ కాంబోజ్‌‌, ప్రఫుల్‌‌ హింగే, ఎన్‌‌. జగదీశన్‌‌, నచికేత్‌‌ భూటే, వైశాక్‌‌. 

వన్డే జట్టు: రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (కెప్టెన్‌‌), దేవదత్‌‌ పడిక్కల్‌‌, ప్రియాన్ష్‌‌ ఆర్యా, సాయి సుదర్శన్‌‌, రజత్‌‌ పటీదార్‌‌, కుమార్‌‌ కుశాగ్ర, నిశాంత్‌‌ సింధు, విప్రజ్‌‌ నిగమ్‌‌, అర్షిన్‌‌ కులకర్ణి, అర్షద్‌‌ ఖాన్‌‌, నమన్‌‌ ధీర్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, ప్రభ్‌‌సిమ్రన్‌‌ సింగ్‌‌, గుర్జప్నీత్‌‌ సింగ్‌‌, యష్‌‌ ఠాకూర్‌‌.