బ్రిటన్ (UK) లో రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న అక్రమ వలసదారుల వ్యతిరేక ఆందోళనలు మంగళవారం (సెప్టెంబర్ 8న) కీలక మలుపు తిరిగాయి. యూకే పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జూనియర్ పాక్ ఆటగాళ్లు బస చేసే హోటల్‌ను.. ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తున్న అక్రమ వలసదారుల (Asylum Seekers) స్థావరంగా భావించిన స్థానిక నిరసనకారులు ఒక్కసారిగా హోటల్ బయట భారీగా మోహరించి తీవ్ర ఆందోళనకు దిగారు.
భయాందోళనలో పాక్ యంగ్ ప్లేయర్లు:
ఈ నాటకీయ పరిణామం దక్షిణ ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మత్ (Portsmouth) నగరంలో చోటు చేసుకుంది. ఓడరేవు నగరం సమీపంలో బోట్ల ద్వారా వచ్చిన వలసదారులను అడ్డుకుని, పోలీసులతో ఘర్షణలకు దిగిన 48 గంటల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్ అండర్-19 క్రికెటర్లు బస చేసిన హోటల్ బయట గుమిగూడిన నిరసనకారులు వారిని అక్రమ వలసదారులుగా భావించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో లోపల ఉన్న యంగ్ క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురవ్వడంతో వెంటనే నిర్వాహకులు భద్రతా దళాలను రంగంలోకి దించారు.
►ALSO READ | టీమిండియాకు గుడ్న్యూస్.. ఆఫ్ఘన్‌తో టీ20 సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా ఆగమనం: కానీ అతడికి బిగ్ షాక్!
మైదానంలోనూ పాక్ జట్టుకి పరాభవం!
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. ఒకవైపు జూనియర్ జట్టు ఇంగ్లాండ్ వీధుల్లో ఎదురైన ఈ పొరపాటు గుర్తింపు (Mistaken Identity) వల్ల హోటల్ గదులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. మరోవైపు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్టు ఆడుతున్న పాకిస్థాన్ సీనియర్ మెన్స్ టీమ్.. మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 133 రన్స్‌కే కుప్పకూలి దారుణమైన అవమానాన్ని ఎదుర్కొంటోంది. బ్రిటన్ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ ఆందోళనలు చివరకు అంతర్జాతీయ క్రికెట్ జట్లకు కూడా భద్రతాపరమైన సవాళ్లను విసురుతుండటం గమనార్హం.
The Pakistan U19 cricket team was temporarily targeted in Portsmouth, England after false online rumors about a bus arrival led protesters to mistake them for asylum seekers. (Times Sports). pic.twitter.com/AWvAw7dFLn
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2026
