భారీగా పెరిగిన ఐఫోన్ పాత మోడల్స్ ధరలు.. iPhone 17పై ఎన్ని వేలు పెరిగిందంటే..

భారీగా పెరిగిన ఐఫోన్ పాత మోడల్స్ ధరలు.. iPhone 17పై ఎన్ని వేలు పెరిగిందంటే..

‘ఐఫోన్ డ్యుయో’ పేరుతో ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ 18 ప్రో, ప్రోమాక్స్ మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేసిన గంటల వ్యవధిలోనే పాత ఐఫోన్ మోడల్స్ ధరలను యాపిల్ సంస్థ భారీగా పెంచేసింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఆపిల్ సంస్థ.. ఇండియాలో ఐఫోన్ 17, ఐఫోన్ 17e, iPhone Air, iPhone 16 ధరలను భారీగా పెంచింది.

iPhone Air 1TB ధరపై రూ. 65,000 పెరిగింది. ఐఫోన్ 17 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 99,900గా ఉంది. ఐఫోన్ 17 ధర రూ. 17 వేలు పెరిగింది. 256GB స్టోరేజ్‌ ఐఫోన్ 17 ధర గతంలో రూ. 82,900 ఉండగా, ఇప్పుడు అది రూ. 99,900కు పెరిగింది.

512GB వెర్షన్ ధర రూ. 1,02,900 నుంచి రూ. 1,24,900 కు పెరిగింది. అంటే.. రూ.22 వేలు పెరిగింది. ఐఫోన్ ఎయిర్ మోడల్ ధర 256GB వెర్షన్ ధర రూ. 1,19,900 నుండి ఇప్పుడు రూ. 1,49,900కు పెరిగింది. 512GB మోడల్ ధర రూ. 1,39,900 నుంచి రూ. 1,74,900కు పెరిగింది. 1TB వెర్షన్ ధర మరింత భారీగా పెరిగింది. ఈ మోడల్ ధర రూ. 1,59,900 నుంచి రూ. 2,24,900 కు చేరింది. అంటే ఒకేసారి రూ. 65,000 పెరిగింది.

ఐఫోన్ 17e మోడల్ ధర కూడా భారీగానే పెరిగింది. 256GB స్టోరేజ్‌ ఐఫోన్ 17e ధర గతంలో రూ. 64,900 ఉండగా, ఇప్పుడు అది రూ. 79,900కు పెరిగింది. 512GB మోడల్ ధర రూ. 84,900 నుండి రూ. 1,04,900 కు పెరిగింది. ఐఫోన్ 16 ధర కూడా పెరగడంతో వినియోగదారులు విస్తుపోయారు. ఆపిల్ ఐఫోన్ 16 ధరను కూడా పెంచింది. 128GB మోడల్ ధర ఇప్పుడు రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 18 మోడల్స్ విడుదలకు ముందు ఇదే ఫోన్ ధర రూ. 69,900గా ఉంది.

►ALSO READ | iPhone Duo.. అమెరికా వెళ్లి కొనుక్కుని వచ్చినా 30 వేలు లాభం.. ఇండియాలో ధర అంత ఎక్కువ..!