టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త తరం ఐఫోన్‌లను ఘనంగా ఆవిష్కరించింది. ‘ఐఫోన్ డ్యుయో’ పేరుతో తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ను టెర్నస్ అమెరికా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇండియాలో ఈ ఫోల్డబుల్ ఐ ఫోన్ ధరపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 250 స్టోరేజ్ వేరియంట్ ధర ఇండియాలో రూ.2,99,900 కావడమే ఇందుకు కారణం.
₹4,50,000 for Foldable iPhone? 😳
— Ankit Uttam (@ankituttam) September 10, 2026
-#iPhoneDuo #Apple #iPhone18 #iphone pic.twitter.com/d6KHsF26Pt
ఇండియాలో ఐ ఫోన్ డ్యుయో ధర ఎంత ఎక్కువ ఉంది అంటే.. ఇదే ఐ ఫోన్ డ్యుయో కోసం.. అమెరికా వెళ్లి.. అక్కడ ఫోన్ కొనుక్కుని.. తిరిగి ఇండియా వచ్చిన కూడా.. ఇంకా 30 వేల రూపాయలు మిగులుతాయి. ఏంటీ ఆశ్చర్యంగా.. నోరెళ్లబెడుతున్నారా.. అవునండీ.. ఐ ఫోన్ డ్యుయో ధర అమెరికాలో అంత చీప్గా ఉంది. ఇండియాలో మాత్రం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తేడా ఏంటో వివరంగా తెలుసుకుందామా..
మన దేశంలో ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర రూ.2 లక్షల 99 వేల 900 రూపాయలు. అంటే దాదాపుగా మూడు లక్షలు. అమెరికాలో ఇదే ఫోన్ ధర 1999 డాలర్లు.. అంటే మన కరెన్సీలో లక్షా 90 వేలు మాత్రమే. ఎతిహాద్ ఎయిర్‌వేస్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. ముంబై నుంచి న్యూయార్క్ ఎయిర్ పోర్ట్కు టికెట్ ధర రూ.77 వేల 852. న్యూయార్క్లో ఫోన్ కొనుక్కుని మళ్లీ రిటర్న్ ఫ్లైట్ పట్టుకుని ముంబై రావొచ్చు.
WAIT… INDIA IS NOW THE 2ND MOST EXPENSIVE COUNTRY TO BUY AN #iPhone18! 🇮🇳💸 🤯#appleevent #iphoneduo pic.twitter.com/SoqRBEAsN4
— CreditCruze (@CreditCruze) September 9, 2026
రానుపోను ఖర్చులు మొత్తం కలుపుకున్నా.. రెండున్నర లక్షలు, రెండు లక్షల 70 వేలకే అయిపోతుందని.. ఇంకా 30 వేలు మిగులుతాయని ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ ఆర్డర్లు, సెప్టెంబర్ 18 నుంచి రిటైల్ అమ్మకాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
iPhone Duo starts at Rs. 3,00,000 in India!
— Ishan Sharma (@Ishansharma7390) September 10, 2026
You can literally book a return flight to the USA, buy the iPhone Duo in Oregon/Delaware, come back to India AND still save Rs. 30,000.
Will you do it? pic.twitter.com/JFhGCkByWR
