Rohit Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ తనదైన స్టైల్లో సరదా వ్యాఖ్యలు, పంచ్‌లతో నిత్యం వార్తల్లో ఉంటాడు. కానీ ఈసారి హిట్‌మ్యాన్ వేసిన పంచ్ మామూలుగా లేదు. ఏకంగా బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ టీమ్‌కు రోహిత్ ఇచ్చిన సైలెంట్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక టీవీ షో ప్రోమోలో రోహిత్ వేసుకున్న టీ-షర్ట్ పై ఉన్న రెండు పదాలు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆ టీ-షర్ట్ వెనుక అసలు కథ ఇదే:
సెప్టెంబర్ 19వ తేదీ నుంచి బుల్లితెరపై ప్రసారం కానున్న ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా రోహిత్ శర్మ హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఈ షో ప్రోమో షూటింగ్ సమయంలో రోహిత్ ప్లెయిన్ వైట్ టీ-షర్ట్ ధరించి కెమెరాతో మాట్లాడాడు. కానీ, ఆ టీ-షర్ట్‌పై Non-Committal? (కమిట్‌మెంట్ లేదా?) అని స్పష్టంగా రాసి ఉంది. నోటితో ఏమీ అనకపోయినా, ఆ టీ-షర్ట్ కోట్ ద్వారా చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌ను రోహిత్ నేరుగా టార్గెట్ చేశాడని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
అగార్కర్‌తో రోహిత్ కి వివాదం ఏంటి:
గతంలో (సెప్టెంబర్ 2025) శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా ప్రకటించిన సందర్భంగా అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచకప్ గురించి చెబుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వరల్డ్ కప్ విషయంలో నాన్-కమిట్మెంట్ (Non-Committal)గా ఉన్నారని వ్యాఖ్యానించాడు. దానికి ఫిబ్రవరి 2026లోనే ఒక ఈవెంట్‌లో రోహిత్ కౌంటర్ ఇస్తూ, దేశం తరఫున ట్రోఫీలు గెలవాలనే కమిట్‌మెంట్, ఆకలి మాకు పుష్కలంగా ఉన్నాయని ఘాటుగా బదులిచ్చాడు. ఇప్పుడు నేరుగా అదే Non-Committal? పదాన్ని టీ-షర్ట్‌పై ముద్రించుకుని వచ్చి అగార్కర్ స్టేట్‌మెంట్‌ను రోహిత్ శర్మ ఎద్దేవా చేశాడు.
►ALSO READ | ఇండియా–ఎ జట్టులో హార్దిక్
అగార్కర్, గంభీర్‌లను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు:
రోహిత్ శర్మ టీ-షర్ట్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్రికెట్ అభిమానులు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లను ఏకిపారేస్తున్నారు. రోహిత్ వంటి వ్యక్తి ఒంటిచేత్తో మ్యాచులని గెలిపిస్తారు.. అలాంటి వారిని జట్టు నుంచి ఎందుకు తప్పించాలని చూస్తున్నారని అగార్కర్, గంభీర్‌లపై మండిపడుతున్నారు. వరల్డ్ కప్ ఆడటానికి హిట్‌మ్యాన్ ఎంత కసితో ఉన్నాడో ఈ టీ-షర్ట్ చెప్తోంది అంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
2027 వరల్డ్ కప్‌లో హిట్‌మాన్ ఆడేనా?:
39 ఏళ్ల రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ ఆడాలని తహతహలాడుతున్నప్పటికీ, సెలెక్టర్లు మాత్రం అతని విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా మాట్లాడుతూ.. 2027 వరల్డ్ కప్‌లో రోహిత్, విరాట్‌ల స్థానంపై ఎలాంటి గ్యారెంటీ లేదని, పూర్తి నిర్ణయం సెలెక్టర్ల చేతుల్లోనే ఉందనడం గమనార్హం. ఫిట్‌నెస్, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆధారంగానే రోహిత్ భవితవ్యం తేలనుంది.
