ఆపిల్ ఐఫోన్ డ్యూయో హైఎండ్ ధర 4 లక్షల 49 వేల రూపాయల.. : కొత్త కారు వస్తుంది కదా..!

ఆపిల్ ఐఫోన్ డ్యూయో హైఎండ్ ధర 4 లక్షల 49 వేల రూపాయల.. : కొత్త కారు వస్తుంది కదా..!

ఐఫోన్.. ఐఫోన్.. ఇప్పుడు ఇదే మానియా నడుస్తుంది. ఐఫోన్ 18 సిరీస్ పేరుతో రిలీజ్ అయిన ఫోన్లకు యమా క్రేజ్ వచ్చింది. ఐఫోన్ ఫస్ట్ టైం ఫోల్డబుల్ లాంఛ్ చేసింది. దీని హై ఎండ్ ధర ఎంతో తెలుసా.. ఇండియాలో అక్షరాల 4 లక్షల 49 వేల 900 రూపాయలు.. అంటే 4 లక్షల 50 వేల రూపాయలు.. దీని ధర విని సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. ఎంతలా అంటే.. ఫోన్ రేటు 4 లక్షల 50 వేల రూపాయలు ఏంటీ అని.. అంతేనా.. ఈ ధర విన్నాక.. కొత్త కారు వస్తుంది కదా అని...   అవును ఐ ఫోన్ డ్యూడ్ ఫోల్డబుల్ ధర విని షాక్ అవుతున్న జనం రియాక్షన్ ఇది. 

ఏదిఏమైనా ఐఫోన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. అందులోనూ ఫస్ట్ టైం ఫోల్డబుల్ ఫోన్ తీసుకురావటంతో.. ఐ ఫోన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత ధర ఉన్నా.. కొనుగోలు కోసం ఎగబడుతున్నారు.

ఆపిల్ మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయో (iPhone Duo)ను అధికారికంగా లాంచ్ చేసింది. దీనితో భారతదేశంలో మొబైల్ ఫోన్ల ధరల రికార్డులన్నీ తిరగరాసాయి. ఈ ఫోన్ స్టార్టింగ్ మోడల్ (256GB) ధర రూ. 2,99,900 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ (2TB) ధర ఏకంగా రూ. 4,49,900కు చేరుకుంది. భారత మార్కెట్లో రూ. 4 లక్షల మార్కును దాటిన మొదటి ఐఫోన్‌గా ఇది నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ (AI) డేటా సెంటర్ల డిమాండ్ వల్ల మెమరీ చిప్ ధరలు పెరగడమే ఈ రకమైన భారీ ధరల పెంపునకు ప్రధాన కారణం.

భారత్‌లో ఐఫోన్ డ్యూయో ధరలు

256GB ధర రూ. 2,99,900

512GB ధర రూ. 3,24,900

1TB ధర రూ. 3,74,900

2TB ధర రూ. 4,49,900

లంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 4,500 నుండి రూ. 81,500 వరకు ఎక్స్చేంజ్ (Trade-in) ఆఫర్లు, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం, అలాగే ICICI, యాక్సిస్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లపై రూ. 7,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అఫీషియల్ ఆక్సెసరీలుగా డ్యూయో ఫోలియో కేస్ (రూ. 14,900), మాడ్యులర్ టూ-పీస్ షెల్ (రూ. 8,900)  ఉన్నాయి.

ఐఫోన్ డ్యూయో ఫీచర్లు

*డిస్ప్లే  బయటి స్క్రీన్ 5.4-అంగుళాల, తెరిచినప్పుడు 7.6-అంగుళాల పెద్ద లోపలి స్క్రీన్ ఉంటుంది. రెండూ 3,000 నిట్స్ బ్రైట్‌నెస్, ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్లతో వస్తాయి.

*బాడీ & బిల్డ్ విషయానికి వస్తే గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్, సెరామిక్ షీల్డ్ 2 కవర్ గ్లాస్,  IP68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్ ఉంది.

*ఇక ప్రాసెసర్ చూస్తే అత్యంత వేగవంతమైన 2nm A20 ప్రో చిప్ ఉంది.

*కెమెరా చూస్తే వెనుక వైపు 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్, బయటి డిస్‌ప్లేపై 12MP కెమెరా, లోపలి డిస్‌ప్లే కింద ఉండే అండర్-డిస్‌ప్లే ఫేస్‌టైమ్ కెమెరా ఇచ్చారు.

*బ్యాటరీ బ్యాకప్ చూస్తే డ్యూయల్ బ్యాటరీ సెటప్ ఉంది. సాధారణ వినియోగంలో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

*భద్రత విషయంలో  సైడ్ బటన్‌లో టచ్ ఐడి (Touch ID) ఉంటుంది (ఫేస్ ఐడి లేదు).

*ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే  iOS 27.1 ఇంకా eSIM మాత్రమే సపోర్ట్ చేస్తుంది.


ఐఫోన్ 18 ప్రో & 18 ప్రో మాక్స్ ధరలు:
డ్యూయోతో పాటు ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరల వివరాలు చూస్తే :
 
256GB  స్టోరేజ్  ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,64,900, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.1,79,900
512GB  స్టోరేజ్  ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,89,900, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.2,04,900
1TB  స్టోరేజ్  ఐఫోన్ 18 ప్రో ధర రూ.2,39,900, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.2,54,900
2TB  స్టోరేజ్  ఐఫోన్ 18 ప్రో ధర రూ.3,14,900, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.3,29,900

ధరల పెంపు  
గతంలో ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256GB ధర రూ. 1,59,900గా ఉండగా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 1TB ధర రూ. 1,84,900కి చేరింది. ఆ తర్వాత ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2TB మోడల్ ధర రూ. 2,29,900కి చేరగా, ఇప్పుడు ఐఫోన్ 18 సిరీస్ ఇంకా డ్యూయో రాకతో ఐఫోన్ల  ధర అత్యధికంగా రూ. 4 లక్షల 50 వేలకు వరకు పెరిగింది.