‘పెద్దపల్లి’లో 16 ఆర్వోబీలను త్వరగా పూర్తి చేయండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

‘పెద్దపల్లి’లో 16 ఆర్వోబీలను త్వరగా పూర్తి చేయండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • రామగుండం–-మణుగూరు రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభించాలి
  • మంచిర్యాల, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో అదనపు రైళ్లకు స్టాపేజీలు కల్పించాలి
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఏళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, సహచర ఎంపీలతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో భేటీ అయ్యారు.

నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.1,000 కోట్లతో మంజూరైన 16 రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ఆర్వోబీ) పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఓదెల, కొలనూర్, కొన్నారం, కన్నాల, కుందనపల్లి తదితర ప్రాంతాల్లో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను ప్రాధాన్యతతో చేపట్టాలన్నారు. మంచిర్యాల హైటెక్ సిటీ నుంచి రాజీవ్ నగర్ వరకు, మందమర్రి పరిధిలో నర్లాపూర్ నుంచి అందుగులపేట వరకు ఆర్ యూబీలు, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలు నిర్మించాలని కోరారు.

మంచిర్యాల హమాలీవాడ వద్ద ఎల్ సీ నంబర్​56 దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు మందమర్రి, రేచ్ని రోడ్ రైల్వేస్టేషన్లలో ఎఫ్ వోబీల విస్తరణకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలన్నారు.

రైల్వే సర్వీసులను మెరుగుపరచాలి

మంచిర్యాల రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భగత్ కీ కోఠి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్, కేరళ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు తిరుపతి వైపు వెళ్లే ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. సిర్పూర్ కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్–-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులను మెరుగుపరచాలన్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్, నవజీవన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు మంజూరు చేయాలని విన్నవించారు.  

కేంద్ర మంత్రి దృష్టికి మంథని రైల్వే కనెక్టివిటీ అంశం

మంథని ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ కల్పించడంలో దశాబ్దాలుగా జాప్యం జరుగుతోందని ఎంపీ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ప్రాంతానికి మంత్రులు వచ్చారు.. వెళ్లారు.. కానీ, మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే కనెక్టివిటీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. 207.8 కిలోమీటర్ల రామగుండం–-మణుగూరు రైల్వే లైన్ ప్రాజెక్టును గతంలో రూ.5,818 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించారని చెప్పారు.

అయితే, పనులు ప్రారంభం కాకపోవడం ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా మంథని, ముత్తారం, కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, మల్హర్ మండలాల ప్రజలకు రవాణా మెరుగై, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయన్నారు. కేవలం బొగ్గు రవాణాకే పరిమితం కాకుండా ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్యాసింజర్ రైల్వే స్టేషన్లను కూడా ప్రణాళికలో చేర్చాలని కోరారు.

పనుల పూర్తి గడువు ప్రకటించాలి

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరికీ రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రైల్వే అభివృద్ధి అంటే కేవలం రైళ్లు నడపడం కాదని, గ్రామాలను పట్టణాలతో, కార్మికులను ఉపాధితో, విద్యార్థులను విద్యావకాశాలతో అనుసంధానం చేయడమని పేర్కొన్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రతీ పెండింగ్​రైల్వే ప్రాజెక్టుకు నిర్దిష్ట గడువు ప్రకటించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు.