హైదరాబాద్ లోని నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో రెండు రోజుల పాటు FERIYA Y FIESTA 4TH EDITION కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువారం ( సెప్టెంబర్ 10 ) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా కొంత సమయం వెనక్కి తగ్గి తమకు నిజంగా ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించుకోవాలని అన్నారు.
కుటుంబం, రాష్ట్రం, దేశం గొప్ప లక్ష్యాలు సాధించాలంటే చిన్ననాటి నుంచే మంచి పునాది అవసరమని.. ప్రతి విద్యార్థి తన విలువ, నైపుణ్యాలను ప్రపంచానికి చాటుతూ.. తెలంగాణ, భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు వంశీకృష్ణ. క్రీడలు, కళలు, సంగీతం, టెక్నాలజీ.. ఆసక్తి ఉన్న రంగంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తిని రోల్ మోడల్‌గా ఎంచుకుని.. వారి విజయాల నుంచి నేర్చుకోవాలని అన్నారు.
అందరూ చెబుతున్నారని ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మకుండా.. ప్రశ్నించడం, ఆలోచించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి.. తాము ఎలాంటి మార్పు తీసుకురాగలమో విద్యార్థులు ఆలోచించాలని అన్నారు. సంగీతం, క్రీడలు సహా వివిధ రంగాల్లో విద్యార్థులు గొప్ప ప్రతిభను చూపుతున్న విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
►ALSO READ | ఫ్యూచర్ సిటీ దగ్గర ఉద్రిక్తత.. టెస్సెరాక్ట్ కంపెనీ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయం అని..విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా మంచి సదుపాయాలు కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.
