తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు కొంగర, రావిర్యాలకు వెళ్లారు. సీఎం రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు.
రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని టెస్సెరాక్ట్ కంపెనీకి కేటాయించి అతిపెద్ద స్కాంకు పాల్పడ్డారంటూ ఆరోపించారు కేటీఆర్. సీఎం రేవంత్ తమ్ముడు కంపెనీ చైర్మెన్ గా ఉన్నానంటూ తన లింక్డ్ ఇన్ బయోలో పెట్టుకున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని ఉందని.. ఇలాంటి నంబర్లు ఉంటాయని కూడా మాకు తెలీదని అన్నారు కేటీఆర్.
