JaspritBumrah: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకేసారి ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించగా, యంగ్ స్పీడ్‌స్టర్ హర్షిత్ రాణా మాత్రం మళ్లీ ఫిట్నెస్ టెస్టులో విఫలమై ఈ సిరీస్ మొత్తానికి దూరం అయినట్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence) నిపుణులు పేర్కొన్నారు.
బుమ్రాకు గ్రీన్ సిగ్నల్.. టీమిండియాకు బిగ్ రిలీఫ్:
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో 3 టీ20ల సిరీస్ ఆడనుంది. జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో మ్యాచ్ సిమ్యులేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఫిట్‌నెస్‌పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుమ్రా మైదానంలోకి దిగడం ఖాయమైంది.
హర్షిత్ రాణా ఔట్.. బీసీసీఐ మెడికల్ బోర్డుపై ప్రశ్నలు:
మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనలోనే గాయపడిన హర్షిత్ రాణా మాత్రం మళ్లీ ఫిట్నెస్ సాధించడంలో దారుణంగా విఫలమయ్యాడు. సెప్టెంబర్ 7, 9 తేదీల్లో నిర్వహించిన మ్యాచ్ సిమ్యులేషన్లలో హర్షిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోలేకపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌తో పాటు రాబోయే ఆసియా గేమ్స్ 2026కు కూడా దూరమయ్యాడు. ఇక హర్షిత్ రాణా స్థానంలో బీసీసీఐ రీప్లెస్‌మెంట్ ని కూడా ప్రకటించింది. హర్షిత్ స్థానంలో యశ్ ఠాకూర్ ని తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ తో పాటు 2026 ఆసియా క్రీడలకు సైతం యశ్ ని సెలక్ట్ చేసినట్లు పేర్కొంది. కాగా అరకొర ఫిట్నెస్తో ఉన్న ప్లేయర్లను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తున్నారంటూ బీసీసీఐలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) విధానాలపై, మెడికల్ టీమ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా బిగ్ అప్డేట్స్:
* సిరీస్ షెడ్యూల్: 3 టీ20లు (సెప్టెంబర్ 13, 15, 17 - ఢిల్లీ వేదికగా)
* ఫిట్నెస్ క్లియర్ అయిన ప్లేయర్లు: జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి
* రూల్డ్ అవుట్ ప్లేయర్: హర్షిత్ రాణా (మళ్లీ గాయం తిరగబెట్టడం వల్ల)
* బుమ్రా రాకతో భారత బౌలింగ్ వింగ్ బలోపేతమైనప్పటికీ, హర్షిత్ రాణా నిష్క్రమణ శ్రేయస్ అయ్యర్ సేనకు కొంత ప్రతికూలంగా మారింది.
Big boost for Team India! 🇮🇳🔥
— SportsTiger (@The_SportsTiger) September 10, 2026
Jasprit Bumrah, Washington Sundar & Nitish Kumar Reddy have been declared fit ahead of the Afghanistan T20I series! 💪🏏
Harshit Rana remains unavailable for the match simulation.#TeamIndia #INDvsAFG #JaspritBumrah #WashingtonSundar pic.twitter.com/zyenB2C822
🚨 News 🚨
— BCCI (@BCCI) September 10, 2026
Yash Thakur replaces Harshit Rana in India’s T20Is squads for Afghanistan T20Is & Asian Games
More Details ▶️ https://t.co/qh86ExSbgB #TeamIndia | #AFGvIND | #AsianGames
