CSK New Head Coach: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా మూడో సీజన్ (2026)లో కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో దారుణంగా విఫలమైంది. దీంతో 2009 నుంచి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను మేనేజ్‌మెంట్ నిర్దాక్షిణ్యంగా తప్పించింది. జట్టు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కి అప్పగించారు. విదేశీ కోచ్‌ల కంటే స్థానిక భారతీయ ప్రతిభనే నమ్ముకున్న ధోనీ, తమిళనాడు మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ (Hemang Badani) వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
విదేశీ లీగ్స్ బంద్.. ధోనీ విసిరిన ఎక్స్‌క్లూజివ్ బాంబ్:
కొత్త కోచ్ ఎంపిక విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఓ మైండ్ బ్లాకింగ్ కండిషన్ పెట్టాడు. కొత్తగా వచ్చే హెడ్ కోచ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఇతర విదేశీ టీ20 లీగ్‌లలో (The Hundred, ILT20) కోచింగ్ ఇవ్వకూడదని మహీ ప్రతిపాదించాడు. గతంలో ఫ్లెమింగ్ సీఎస్‌కేతో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో జోహ్యాన్నెస్‌బర్గ్ సూపర్‌కింగ్స్ (JSK), అమెరికా లీగ్‌లో టెక్సాస్ సూపర్‌కింగ్స్ (TSK) లకు కూడా కోచ్‌గా పనిచేసేవాడు. కానీ ఆ విధానానికి స్వస్తి చెప్పి, పూర్తి సమయం సీఎస్‌కే మీదే దృష్టి పెట్టే కోచ్ కావాలని ధోనీ డిమాండ్ చేస్తున్నాడు.
హేమాంగ్ బదానీకి కొత్త చిక్కుముడి:
ఈ ఎక్స్‌క్లూజివ్ కోచ్ రూల్ ఇప్పుడు హేమాంగ్ బదానీకి పెద్ద సమస్యగా మారింది. బదానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ లీగ్ ది హండ్రెడ్ లో సదరన్ బ్రేవ్, ILT20 లో దుబాయ్ క్యాపిటల్స్ జట్లకు హెడ్ కోచ్‌గా ఉంటూ, MLC లో సీటెల్ ఓర్కాస్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. సీఎస్‌కే హెడ్ కోచ్‌గా చేరాలంటే అతను తన విదేశీ కాంట్రాక్టులన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. దీంతో అతనికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ బదానీ ఒప్పకోకపోతే విదేశీ కోచ్ ఆప్షన్లను కూడా చెన్నై యాజమాన్యం పరిశీలిస్తుంది.
చెపాక్ కోట కూలిపోయింది.. బదానీ ఎందుకు పర్ఫెక్ట్:
గత రెండు మూడేళ్లుగా చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే వరుసగా మ్యాచ్‌లు ఓడిపోయింది. చెపాక్ పిచ్ స్వభావాన్ని రీడ్ చేయడంలో ఫ్లెమింగ్ దారుణంగా విఫలమయ్యాడని భావిస్తున్న యాజమాన్యానికి, తమిళనాడు ప్లేయర్ అయిన బదానీ పర్ఫెక్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్‌గా పని చేసిన అతడికి SA20, ILT20, లంక ప్రీమియర్ లీగ్ (LPL) లీగ్స్‌లో వరుసగా టైటిళ్లు గెలిపించిన ట్రాక్ రికార్డుంది.
ALSO READ : వరల్డ్ కప్ దగ్గరపడుతోంది..
మెగా వేలం.. సీఎస్‌కే డిఎన్‌ఏని మళ్లీ తెచ్చే ప్లాన్:
2025 మెగా వేలంలో సరైన వ్యూహం లేకపోవడం, 2026 సీజన్‌కు ముందు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై మితిమీరిన పెట్టుబడి పెట్టడంతో సీఎస్‌కే తమ సొంత డిఎన్‌ఏ (DNA)నే కోల్పోయింది. ముంచుకొస్తున్న రాబోయే మెగా వేలంలో జట్టును మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్త కోచ్‌ను త్వరగా ఎంపిక చేసి వేలం వ్యూహాలను సిద్ధం చేయాలని ధోనీ భావిస్తున్నాడు. మరో వారం రోజుల్లో సీఎస్‌కే కొత్త కోచ్‌పై అధికారిక ప్రకటన రానుంది.
