Varun Tej: మెగా వారసుడి క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Varun Tej: మెగా వారసుడి  క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటీ లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ (Vaayuv) ముఖాన్ని తొలిసారి రివీల్ చేశారు. వాయువ్ ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా.. క్యూట్ మెగా ప్రిన్స్తో కలిసి దిగిన బ్యూటీఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ & లావణ్య.. తమ కుమారుడికి స్పెషల్ విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వాయువ్ తన ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేశాడని, తండ్రిగా మారడం తన జీవితంలోనే బెస్ట్ పార్ట్ అని వరుణ్ ట్వీట్ చేశారు.

‘‘నా ప్రియమైన వాయువ్.. నువ్వు నా ప్రపంచాన్ని ఊహించలేనంత అందంగా మార్చేశావు. నిన్ను తొలిసారి కళ్లారా చూసేలోపే నీపై ప్రేమలో పడిపోయాను. హ్యాపీ 1st బర్త్‌డే వాయువ్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..’’ అని వరుణ్ తన ప్రేమను తెలిపారు. ఇపుడీ ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో మెగా  ఫ్యాన్స్తో పాటు పలువురు సినీ స్టార్స్ మెగా చిన్నారికి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. 

2025 సెప్టెంబర్ 10న జన్మించిన వాయువ్ ఫొటోలను ఇప్పటివరకు పలుమార్లు షేర్ చేసినప్పటికీ, ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇప్పుడు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా ఫేస్ రివీల్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే, దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వరుణ్ & లావణ్య జంట.. 2023 నవంబర్‌ 1న వివాహబంధంతో ఒక్కటయ్యారు.