పణజి: ముంబై–గోవా హైవే విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయ్యారు. ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఆలస్యాన్ని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనులు ఏండ్లుగా కొనసాగడం తనకే సిగ్గుగా అనిపిస్తున్నదని అన్నారు.
పనులు పూర్తయ్యాక హైవే ప్రారంభోత్సవానికి హాజరుకాబోనని స్పష్టం చేశారు. గురువారం పణజి సమీపంలో ఎలివేటెడ్ రోడ్డు కారిడార్‌ను ప్రారంభించాక గడ్కరీ మాట్లాడారు. ‘‘ముంబై, గోవా హైవే ఆలస్యం సిగ్గనిపిస్తున్నది. వచ్చే ఏడాదిలోగా త్వరగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను పెద్ద సంఖ్యలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు అధికారులను సస్పెండ్ చేసి రికార్డు సృష్టించాలనుకుంటున్నాను" అని వార్నింగ్ ఇచ్చారు.
