ప్రజల ప్రాణాలకు జవాబుదారీతనం ఏదీ?..మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్

ప్రజల ప్రాణాలకు జవాబుదారీతనం ఏదీ?..మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌‌‌‌లోని బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ప్రజల ప్రాణాల పట్ల జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, కలుషిత నీరు, కల్తీ దగ్గు మందుల కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలపై ఖర్గే గురువారం ‘ఎక్స్’లో స్పందించారు.

 సాగర్ జిల్లాలో నకిలీ మద్యం తాగి 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఎవరికో ఒకరికి కొడుకు, తండ్రి లేదా భర్త దూరమయ్యారని, కానీ బీజేపీ ప్రభుత్వానికి ఇది  ఒక ప్రమాదం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.