చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)ను నమోదిత రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించిందని తమిళనాడు సీఎం విజయ్ గురువారం తెలిపారు. పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తును కేటాయించినట్లు ‘ఎక్స్’ వేదికగాచెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సాధించిన పురోగతిని తమిళనాడు రాజకీయాల్లో ‘అపూర్వమైన అద్భుతం’గా అభివర్ణించారు. 35 శాతం ఓట్లతో టీవీకేను అతిపెద్ద పార్టీ స్థాయికి చేర్చారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. నిజాయతీ, అవినీతి రహిత పాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని విజయ్ స్పష్టం చేశారు.
