వినాయకుడికి ఆకుల పూజ.. ఆరోగ్యం, వైద్య రహస్యం ఇదే..!

వినాయకుడికి ఆకుల పూజ.. ఆరోగ్యం, వైద్య రహస్యం ఇదే..!

వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఈ పద్దతిలోనే వినాయకుడిని ఎందుకు పూజ చేయాలి.. వినాయక పూజలో వైద్య రహస్యం ఏమిటి.. మొదలగు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

పండితులు తెలిపిన వివరాల ఈ ఏడాది (2026) సెప్టెంబర్​ 11న వినాయకుడికి దేశ వ్యాప్తంగా పూజలు చేప్తారు.  ఈ పూజలో అన్నీ ఆకులనే వాడతారు.  గణేష్​ పూజాలో వాడే 21 రకాల పత్రులు (ఆకులు) సాధారణమైన ఆకులు కావు. వీటిలో ఎంతో  మహాత్కృష్టమైన , శక్తివంతమైన ఔషధులు ఉన్నాయి.  వీటితో పూజ చేయడంవల్ల...  కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది.

వినాయకుడిని 9 రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజించిన తరువాత ఆ స్వామిని నీళ్లలో  నిమజ్జనం  చేస్తారు.  ఇలా ఎందుకు చేయాలనే విషయాన్ని పరిశీలిస్తే .. వర్షాల వలన  చెరువులు, బావులు, నదుల్లోని నీరు కలుషితం అవుతుంది.  అలా కాకుండా  మట్టి వినాయక విగ్రహం నీటిలో కరిగి  - .. నీరు కలుషితం కావడం శుద్దిగా ఉంటుంది. సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మట్టికి నీటి మలినాన్ని గ్రహించే శక్తి ఎక్కువుగా ఉంటుంది.  

పండితులు తెలిపిన వివరాల ప్రకారం  21 రకాల ఆకులతో పూజిస్తారు.  ఈ ఆకులతో పూజలు చేయడం వలన ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలను మట్టి విగ్రహం గ్రహిస్తుంది.  వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వలన 

ALSO READ : Ganesh Chaturdhi 2026: వినాయకుడికి ఎన్ని రూపాలు..

అలా నీటిలో కలిపిన మట్టి , 21 రకాల పత్రి కలిసి 23  ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి , జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యంమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు.వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి.
 

1.మాచీ పత్రం:మాచీపత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

2.బృహతీ పత్రం:దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక , పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి

3.బిల్వ పత్రం:బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా , ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.

4.దూర్వా పత్రం:దూర్వా పత్రం అంటే గరిక.. తెల్ల గరిక.., నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

5.దుత్తూర పత్రం:దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

6.బదరీ పత్రం:బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు , జిట్రేగు , గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

7.అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు , ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

8.తులసీ పత్రం:హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.  అయితే వినాయకుడి పూజలో తులసి పత్రాన్ని ఎట్టి పరిస్థితిలో వాడకూడదు.  తులసీ మాతకు వినాయకుడి శాపం ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  కావున తులసి ఆకుతో పూజ చేయాల్సిన మంత్రం వచ్చినప్పుడు అక్షింతలు వాడాలి.

9.చూత పత్రం:చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హిందువుల  గృహం పండుగ రోజులలో కనిపించదు.

10.కరవీర పత్రం:దీనినే గన్నేరు అంటారు. తెలుపు , పసుపు , ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

11.విష్ణుక్రాంత పత్రం:ఇది నీలం , తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

12.దాడిమీ పత్రం:దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

13.దేవదారు పత్రం:దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

14.మరువక పత్రం:దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం , మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

15.సింధువార పత్రం:సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

16.జాజి పత్రం:ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

17.గండలీ పత్రం:దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

18.శమీ పత్రం:జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

19.అశ్వత్థ పత్రం:రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

20.అర్జున పత్రం:మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

21.అర్క పత్రం:ఇది ఎంతో విశిష్టతమైనది దైవ కార్యలకి శుభకరమైనదిఔషధ గుణాలు కలిగినది.

వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి.  వీటి గాలి సోకినా దీర్ఘకాల వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.