హైదరాబాద్: బంజారాహిల్స్‌లో యువతీ, యువకుడు కారుతో వీరంగం సృష్టించారు. వోక్స్‌వ్యాగన్ కారుతో అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద నానా రభస చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను ఈ కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రంజనా రాయ్ (32) అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు యువతీయువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
